News July 17, 2024
ఎర్రమట్టి దిబ్బల తవ్వకం ఆపండి: CMO
AP: వైజాగ్‌లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిపై సీఎం కార్యాలయం దృష్టి సారించింది. తవ్వకాల్ని ఆపేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే పనుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
Similar News
News December 13, 2024
పింఛన్‌తో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్
తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News December 13, 2024
నేడు ఫ్రాన్స్ ప్రధానిని ప్రకటించనున్న మేక్రాన్
ఫ్రాన్స్‌కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.
News December 13, 2024
కళకళలాడనున్న లోక్‌సభ.. ఎందుకంటే?
శీతకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభ సరిగ్గా జరిగిందే లేదు. ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ కాంగ్రెస్, ‘సొరోస్, రాహుల్ ఏక్ హై’, సొరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ BJP విమర్శించుకుంటున్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా నేడు, రేపూ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. దీనికి అన్ని పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. చాన్నాళ్ల తర్వాత సభ నిండుగా కళకళలాడనుంది. అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.