News July 19, 2024
ఇక్కడ ఫ్యాషన్ షో జరుగుతోందా? లాయర్‌పై CJI ఆగ్రహం

సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు విధిగా ధరించాల్సిన నెక్‌బ్యాండ్ సదరు న్యాయవాది ధరించకపోవడమే అందుక్కారణం. ‘కేసు విచారణ సంగతి అలా ఉంచండి. మీ మెడ చుట్టూ బ్యాండ్ ఏది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతోందా?’ అని ప్రశ్నించారు. హడావుడిగా వచ్చానని లాయర్ చెప్పగా ఇలా ఉంటే కేసు వినేది లేదని సీజేఐ స్పష్టం చేశారు.
Similar News
News January 28, 2026
కేరళ బస్సు వివాదం.. షింజితా ముస్తఫా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కేరళలోని ఓ బస్సులో దీపక్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని <<18917671>>ఆత్మహత్యకు<<>> కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.
News January 28, 2026
నేడు..

☕AP క్యాబినెట్ భేటీ
☕ఢిల్లీలో కేంద్రమంత్రులతో AP డిప్యూటీ సీఎం పవన్ భేటీ
☕భీమవరం ముఖ్య నేతలతో జగన్ సమావేశం
☕అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
☕మేడారం జాతర షురూ.. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు
☕మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు
☕మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేశ్ గౌడ్ పర్యటన
☕ఢిల్లీలో NCC ర్యాలీ, పాల్గొననున్న ప్రధాని
☕వైజాగ్‌లో భారత్-న్యూజిలాండ్ నాలుగో T20
News January 28, 2026
బాయ్‌కాట్ లీకులు.. పాక్‌కు భారీ షాక్ తప్పదా?

T20WCలో ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ పీసీబీ ఛైర్మన్ నఖ్వీ లీకులు ఇస్తున్నారు. అయితే ఇదే జరిగితే ఆ దేశంపై $38 మిలియన్ల దావా వేసేందుకు బ్రాడ్‌కాస్టర్ సిద్ధమవుతోంది. ఎంతో క్రేజ్ ఉండే INDvsPAK మ్యాచ్ కోసం ఇప్పటికే భారీగా అడ్వర్‌టైజింగ్ స్లాట్లు, స్పాన్సర్‌షిప్స్ బుక్కయ్యాయి. ఒకవేళ బాయ్‌కాట్ ప్రకటన వస్తే నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని బ్రాడ్‌కాస్టర్ వర్గాలు పేర్కొన్నాయి.


