News July 19, 2024
ఇక్కడ ఫ్యాషన్ షో జరుగుతోందా? లాయర్‌పై CJI ఆగ్రహం
సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు విధిగా ధరించాల్సిన నెక్‌బ్యాండ్ సదరు న్యాయవాది ధరించకపోవడమే అందుక్కారణం. ‘కేసు విచారణ సంగతి అలా ఉంచండి. మీ మెడ చుట్టూ బ్యాండ్ ఏది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతోందా?’ అని ప్రశ్నించారు. హడావుడిగా వచ్చానని లాయర్ చెప్పగా ఇలా ఉంటే కేసు వినేది లేదని సీజేఐ స్పష్టం చేశారు.
Similar News
News December 12, 2024
పోలీసు కస్టడీకి వర్రా రవీందర్
AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ అరెస్టయ్యారు.
News December 12, 2024
నేను ప్రెగ్నెంట్ కాదు: సోనాక్షి సిన్హా
తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను ఇంకా గర్భం దాల్చలేదని తెలిపారు. బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె మండిపడ్డారు. తమకు పెళ్లై నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. కాగా గత జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
News December 12, 2024
విజయ్ వాయిస్ ఓవర్ ప్రత్యేకం: రష్మిక
తాను నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చివరి వరకు తనకు తెలియదని హీరోయిన్ రష్మిక తెలిపారు. కానీ తనకు అది ప్రత్యేకమని ఆమె చెప్పారు. ‘నాకు హీరోలందరితోనూ స్నేహం ఉంది. సల్మాన్ సెట్‌లో ఉంటే షూటింగ్ సరదాగా సాగుతుంది. ఓసారి నేను సెట్‌లో అనారోగ్యానికి గురైతే మంచి ఫుడ్ తెప్పించారు. ఆయన నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దళపతి విజయ్ అంటే కూడా ఎంతో ఇష్టం’ అని ఆమె పేర్కొన్నారు.