News July 20, 2024

ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.

Similar News

News January 21, 2026

శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్

image

శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళలోని విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 90 రోజుల్లోపు ఛార్జిషీట్ వేయడంలో SIT విఫలమైనందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారించాల్సి ఉన్నందున పొట్టికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇక రాజీవరు బెయిల్‌పై కోర్టు గురువారం తీర్పు చెప్పనుంది.

News January 21, 2026

భయపడొద్దు పార్టీ అండగా ఉంటుంది: జగన్

image

AP: ప్రభుత్వ దన్నుతో కూటమి నేతలు, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని దిగజారుస్తున్నారని YCP చీఫ్ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ కుమారులు, పార్టీనేతలు తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. కాగా ఎవరూ భయపడొద్దని, అక్రమ కేసులపై పార్టీ లీగల్ సెల్ న్యాయసహాయం అందిస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

News January 21, 2026

హైదరాబాద్‌లోని NIRDPRలో 98 ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)98 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: career.nirdpr.in/