News July 20, 2024

ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.

Similar News

News December 10, 2024

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు. మరోవైపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

News December 10, 2024

అమెరికా వారికి ఆశ్రయం: భార‌త్‌

image

భార‌త్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ప్ర‌తి ముగ్గురు నేర‌స్థులు, ఉగ్ర‌వాదుల్లో ఒక‌రు అమెరికాలో తలదాచుకుంటున్నార‌ని, ఆగ్ర‌రాజ్యం వారికి ఆశ్రయంగా మారింద‌ని కేంద్ర హోం శాఖ పేర్కొంది. వీరి అప్ప‌గింత‌ కోసం భార‌త‌ దర్యాప్తు సంస్థలు చేసిన 178 పెండింగ్ అభ్య‌ర్థ‌న‌ల్లో 65 ప్ర‌స్తుతం US ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలిపింది. 2002-18 మ‌ధ్య 11 అభ్య‌ర్థ‌న‌ల‌కే US స‌మ్మ‌తించినట్టు పేర్కొంది.