News July 21, 2024

గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, వైసీపీ నేతలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 24, 2025

గంగూలీ బయోపిక్.. హీరో ఇతడేనా?

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు దాదా రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. ‘ఉడాన్’ ఫేమ్ విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తారు. కాగా గంగూలీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ 2021లోనే ప్రకటించారు.

News January 24, 2025

WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.

News January 24, 2025

ఘోరం: యువతిని రేప్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌లో..

image

ముంబైలో ‘నిర్భయ’ తరహా ఘటన సంచలనం రేపుతోంది. 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు చొప్పించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు గొరేగావ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకొని విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బ్లేడ్, రాళ్లను తొలగించారు.