News July 21, 2024
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, వైసీపీ నేతలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2025
భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు: పాక్ అభిమానులు

ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
News February 15, 2025
కులగణన.. రేపటి నుంచి వారికి మరో ఛాన్స్

TG: కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాల వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు టోల్‌ఫ్రీ నంబర్ 040 21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తారు. MPDO, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. https://seeepcsurvey.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో సర్వే ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చు.
News February 15, 2025
హీరోయిన్‌లా మోనాలిసా.. PHOTO

కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా కొత్త ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేరళలో ఓ జువెల్లరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు రెడ్ గాగ్రాలో ఉన్న ఆమెను కెమెరామెన్ క్లిక్ అనిపించాడు. ఆ ఫొటోను పోస్ట్ చేసిన మోనాలిసా లవ్ కేరళ అంటూ లవ్ సింబల్‌ను పంచుకున్నారు. దీంతో హీరోయిన్‌లా ఉన్నావంటూ, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు ఆ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.