News July 22, 2024

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 7, 2025

నేను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌ను: రాణా

image

ఢిల్లీలో NIA కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల ఘటన సూత్రధారి తహవూర్ <<16245394>>రాణా <<>>సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌నని, లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ పొందినట్లు చెప్పాడు. ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను పరిశీలించి పాక్ ISIతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేశానన్నాడు. అంతకుముందు గల్ఫ్ వార్ సమయంలో పాక్ ఆర్మీ తనను సౌదీకి పంపిందన్నాడు. కాగా రాణాను US నుంచి తీసుకొచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే.

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.

News July 7, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

image

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్‌ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి