News July 22, 2024

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 7, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు మన్యం, అల్లూరి, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది.

News October 7, 2024

Aiతో తెలుగు రాష్ట్రాల్లో 122M స్పామ్ కాల్స్ బ్లాక్: AIRTEL

image

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు Airtel నెట్‌వర్క్‌లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్‌ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్‌, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్‌కు అందుబాటులో ఉందని పేర్కొంది.

News October 7, 2024

ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC

image

దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.