News July 24, 2024

ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల

image

AP: గత వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. పాలసీలో అవకతవకలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

Similar News

News January 28, 2025

టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

image

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

News January 28, 2025

BJPలోకి అంబటి రాయుడు?

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.

News January 28, 2025

IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

image

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.