News January 28, 2025

IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

image

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.

Similar News

News February 14, 2025

మస్క్‌తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

image

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.

News February 14, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 14, 2025

శుభ ముహూర్తం (14-02-2025)

image

✒ తిథి: బహుళ విదియ రా.8.55 వరకు
✒ నక్షత్రం: పుబ్బ రా.10.54 వరకు
✒ శుభ సమయం: ఉ.9.26 నుంచి ఉ.9.56, సా.4.26-సా.4.38
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.7.13 వరకు
✒ అమృత ఘడియలు: మ.3.56 నుంచి సా.5.40 వరకు

error: Content is protected !!