News July 24, 2024
కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యత లేదు: హరీశ్
TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సభ వాయిదా పడ్డ సమయంలో అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న వీహెచ్‌లాంటి సీనియర్ లీడర్లకు ఎలాంటి పదవీ దక్కలేదన్నారు. స్వార్థం కోసం కండువాలు కప్పుకొని నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి క్యాబినెట్ హోదా పదవులిచ్చారని విమర్శించారు.
Similar News
News January 28, 2025
BJPలోకి అంబటి రాయుడు?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.
News January 28, 2025
IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.
News January 28, 2025
నేడు ప్రొద్దుటూర్‌కు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం పార్కు’ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్‌దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.