News July 26, 2024
ఆ బాధ్యతలు రోహిత్‌కే అప్పగించేవాడిని: బుమ్రా

క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో తనకు పెద్దగా ఏమీ తెలియదని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. IPLలో ఆడటం ప్రారంభించాక రోహిత్ శర్మను ఫీల్డ్ సెట్ చేయమని చెప్పేవాడినని ఓ కార్యక్రమంలో తెలిపారు. తాను ఏ బాల్ వేస్తున్నానో చెప్పి అందుకు అనుగుణంగా హిట్ మ్యాన్‌ను ఫీల్డింగ్ సెట్ చేయమని అడిగేవాడినని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆటలో అనుభవం వచ్చాక ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
సొంతింటి ‘బడ్జెట్’కు నిర్మలమ్మ బూస్ట్?

వచ్చే బడ్జెట్‌లో ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఊపిరిపోయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ₹45 లక్షల ధర పరిమితిని ₹75 లక్షల నుంచి ₹95 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నా సామాన్యుడికి ఇల్లు భారమవుతోందని.. పన్ను రాయితీలు, అద్దె గృహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును ₹5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌లో ఉద్యోగాలు

నోయిడాలోని<


