News July 26, 2024

ఆ బాధ్యతలు రోహిత్‌కే అప్పగించేవాడిని: బుమ్రా

image

క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో తనకు పెద్దగా ఏమీ తెలియదని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. IPLలో ఆడటం ప్రారంభించాక రోహిత్ శర్మను ఫీల్డ్ సెట్ చేయమని చెప్పేవాడినని ఓ కార్యక్రమంలో తెలిపారు. తాను ఏ బాల్ వేస్తున్నానో చెప్పి అందుకు అనుగుణంగా హిట్ మ్యాన్‌ను ఫీల్డింగ్ సెట్ చేయమని అడిగేవాడినని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆటలో అనుభవం వచ్చాక ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 13, 2024

పింఛన్‌తో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్

image

తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News December 13, 2024

నేడు ఫ్రాన్స్ ప్రధానిని ప్రకటించనున్న మేక్రాన్

image

ఫ్రాన్స్‌కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.

News December 13, 2024

కళకళలాడనున్న లోక్‌సభ.. ఎందుకంటే?

image

శీతకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభ సరిగ్గా జరిగిందే లేదు. ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ కాంగ్రెస్, ‘సొరోస్, రాహుల్ ఏక్ హై’, సొరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ BJP విమర్శించుకుంటున్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా నేడు, రేపూ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. దీనికి అన్ని పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. చాన్నాళ్ల తర్వాత సభ నిండుగా కళకళలాడనుంది. అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.