News July 26, 2024
ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్.. ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్లు
AP: MBA, MCA, PG కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మొదటి విడత షెడ్యూల్ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. వచ్చే నెల 4 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లకు, 8న ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించారు. 10న సీట్ల కేటాయింపు కాగా సీట్లు పొందినవారు వచ్చే నెల 12 నుంచి 16 మధ్యలో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Similar News
News December 21, 2024
లెజెండరీ క్రికెటర్లకు దక్కని ఫేర్‌వెల్
టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్లకు ఫేర్‌వెల్ లభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించిన యువరాజ్, ద్రవిడ్, సెహ్వాగ్, VVS లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ధోనీ, సురేశ్ రైనా, ధవన్, అశ్విన్‌లకు గుర్తుండిపోయే ఫేర్‌వెల్ ఇవ్వాల్సిందంటున్నారు.
News December 21, 2024
సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్
TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్‌లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్‌లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.