News July 26, 2024

ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్.. ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్లు

image

AP: MBA, MCA, PG కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మొదటి విడత షెడ్యూల్ నోటిఫికేషన్‌ ప్రకారం వచ్చే నెల 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. వచ్చే నెల 4 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లకు, 8న ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించారు. 10న సీట్ల కేటాయింపు కాగా సీట్లు పొందినవారు వచ్చే నెల 12 నుంచి 16 మధ్యలో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Similar News

News October 12, 2024

కమలా హారిస్‌కు ఏఆర్ రెహమాన్ మద్దతు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె కోసం 30 నిమిషాల సంగీత ప్రదర్శన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దక్షిణాసియా నుంచి హారిస్‌కు మద్దతునిచ్చిన తొలి కళాకారుడు ఆయనే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున హారిస్ పోటీ పడుతున్నారు.

News October 12, 2024

సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’

image

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహీనూర్’ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఇవాళ దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

News October 12, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మ.ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.