News July 27, 2024

భారత్‌లో వాట్సాప్ నిలిచిపోదు: కేంద్రం

image

భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేసే ఆలోచన మెటా సంస్థకు లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా? అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ప్రశ్నించారు. సర్వీసుల నిలిపివేతపై తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని వైష్ణవ్ బదులిచ్చారు. కాగా వాట్సాప్‌లో ఎన్‌క్రిప్షన్ విధానం తొలగించాలని కేంద్రం ప్రతిపాదిస్తే తాము భారత్‌లో సేవలు నిలిపివేస్తామని మెటా గతంలో వ్యాఖ్యానించింది.

Similar News

News November 10, 2025

టెర్రరిస్ట్ అరెస్ట్.. ఇంట్లోనే విషపదార్థం తయారీ!

image

గుజరాత్ పోలీసులు <<18243395>>అరెస్ట్<<>> చేసిన HYD వ్యక్తి డా.మొహియుద్దీన్ రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్‌ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్‌ను పెద్ద మొత్తంలో పీల్చినా, ఆహారం/నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది.

News November 10, 2025

ఆ ఇద్దరిలో ఒకరికి RR పగ్గాలు?

image

వచ్చే IPL సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సారథి <<18248474>>సంజు శాంసన్<<>> జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ధ్రువ్ జురెల్, జైస్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RR కెప్టెన్సీ రేసులో వీళ్లే ముందున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియాన్ పరాగ్ పేరు ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. ఎవరు RR కెప్టెనైతే బాగుంటుంది? COMMENT

News November 10, 2025

అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన

image

వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న మహిళా క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ జాగ్రత్తలు చెప్పారు. ‘మీకు ఇస్తామని చెప్పిన అవార్డులు, రివార్డులు అందకుంటే నిరుత్సాహపడకండి. విజేతల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. ఈ సిగ్గులేని వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దీనికి బాధపడొద్దు’ అని సూచించారు. గతంలో 1983 మెన్స్ టీమ్‌కూ ఇలాంటి హామీలు వచ్చాయని తెలిపారు.