News July 27, 2024
పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు జిల్లా దుస్థితికి BRS పార్టీనే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ‘కరీంనగర్లో ఓడిపోతా అని తెలిసి కేసీఆర్ పాలమూరుకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించాం. కానీ ఆయన పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్లుగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో వలసలు పెరిగాయి’ అని విమర్శించారు.
Similar News
News December 30, 2025
చెత్త రికార్డు.. 10 ఓవర్లలో 123 రన్స్ ఇచ్చాడు

విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచులో పుదుచ్చేరి కెప్టెన్ అమన్ హకీం ఖాన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. 10 ఓవర్లలో ఏకంగా 123 రన్స్ సమర్పించుకున్నారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యంత చెత్త రికార్డు. ఈ మ్యాచులో ఝార్ఖండ్ 368/7 స్కోరు చేయగా, పుదుచ్చేరి 235 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో JHA 133 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా ఇటీవల IPL వేలంలో హకీంను CSK ₹40 లక్షలకు కొనుగోలు చేసింది.
News December 30, 2025
2025: నోరు జారి ట్రోల్ అయ్యారు

ఈ ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యాఖ్యలతో ట్రోల్ అయ్యారు. ‘అరి’ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యర్ రిలీజ్ సమయంలో చేసిన <<17980424>>వ్యాఖ్యలు<<>> మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి. హనుమాన్‌పై కోపం అంటూ దర్శకుడు రాజమౌళి సైతం ట్రోల్ అయ్యారు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించగా ఆయన <<18374715>>క్షమాపణలు<<>> చెప్పారు. ఇటు శివాజీ <<18688029>>వ్యాఖ్యలు<<>> సృష్టించిన దుమారం ఇంకా చల్లారలేదు.
News December 30, 2025
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 84,649 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 25,932 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, ఇండిగో, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫీ, టాటా స్టీల్, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


