News July 27, 2024

పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

image

TG: పాలమూరు జిల్లా దుస్థితికి BRS పార్టీనే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ‘కరీంనగర్‌లో ఓడిపోతా అని తెలిసి కేసీఆర్ పాలమూరుకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించాం. కానీ ఆయన పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్లుగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో వలసలు పెరిగాయి’ అని విమర్శించారు.

Similar News

News December 13, 2024

BREAKING: RBI హెడ్ క్వార్టర్స్‌కు బాంబు బెదిరింపులు

image

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2024

నేడు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.

News December 13, 2024

స్టాక్ మార్కెట్లు విలవిల.. RS 2.5L CR నష్టం

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.