News July 28, 2024

ట్రంప్-కమల.. ఒక్క శాతమే ఓట్ల తేడా

image

US అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌కు సొంత పార్టీ నుంచే కాకుండా ప్రజల మద్దతు పెరుగుతోంది. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు రిపబ్లికన్, డెమోక్రాట్ మధ్య 6% ఓట్ల తేడా ఉండగా, ఇప్పుడది 1 శాతానికి తగ్గినట్లు న్యూయార్క్ టైమ్స్ సర్వే వెల్లడించింది. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత ఆయనకు మద్దతు పెరగగా, ఇప్పుడు హారిస్‌తో గట్టిపోటీ తప్పదని అంచనా.

Similar News

News January 31, 2025

రాష్ట్ర ఆదాయం పడిపోయింది: KCR

image

తెలంగాణ ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ CM KCR సంచలన ఆరోపణలు చేశారు. ₹13వేల కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రానురాను పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. మాట్లాడితే తనను ఉద్దేశించి ఫామ్‌హౌస్ అంటుండటంపై స్పందించిన KCR.. ‘ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? వాళ్లు వస్తే పార ఇచ్చి తవ్వుకోమందాం’ అని ఎద్దేవా చేశారు.

News January 31, 2025

అప్పటి లోపు టీచర్ల బదిలీ పూర్తి: మంత్రి లోకేశ్

image

AP: మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా టీచర్ల బదిలీ పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉమ్మడి AP, నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేసింది మేమే. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వ నిర్ణయాల్లో టీచర్ల అభిప్రాయాలుంటాయి. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం వారి సమస్యలు వింటున్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెస్తున్నాం’ అని చెప్పారు.

News January 31, 2025

ఓటీటీలోకి సూపర్‌హిట్ మూవీ

image

మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా OTT స్ట్రీమింగ్ ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సోనీ లివ్ వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదలై రూ.100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.