News January 31, 2025
రాష్ట్ర ఆదాయం పడిపోయింది: KCR

తెలంగాణ ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ CM KCR సంచలన ఆరోపణలు చేశారు. ₹13వేల కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. రానురాను పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని, మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. మాట్లాడితే తనను ఉద్దేశించి ఫామ్‌హౌస్ అంటుండటంపై స్పందించిన KCR.. ‘ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? వాళ్లు వస్తే పార ఇచ్చి తవ్వుకోమందాం’ అని ఎద్దేవా చేశారు.
Similar News
News February 16, 2025
నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.
News February 16, 2025
త్వరలో మహిళలకు నెలకు రూ.2,500: CM

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.
News February 16, 2025
గజిబిజి అనౌన్స్‌మెంట్‌కు 18 మంది బలి!

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్‌మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్‌ఫామ్ నుంచి 16వ ప్లాట్‌ఫామ్‌కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.