News July 30, 2024
ఇళ్ల నిర్మాణంపై సీఎం కీలక నిర్ణయం

AP: మధ్య, దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి, కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు YCP హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ)-2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


