News July 30, 2024

ఇళ్ల నిర్మాణంపై సీఎం కీలక నిర్ణయం

image

AP: మధ్య, దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి, కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు YCP హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ)-2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News February 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 16, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్
* ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: భట్టి
* BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
* మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
* టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: మంత్రి లోకేశ్
* జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్

News February 16, 2025

తాజ్ మహల్‌ను సందర్శించిన రిషి సునాక్

image

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్‌ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్‌ బుక్‌లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్‌మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.

error: Content is protected !!