News July 31, 2024

తుది విడతలో 17,575 సీట్ల కేటాయింపు

image

AP: ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఫైనల్ ఫేజ్‌లో 17,575 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయినప్పటికీ మరో 18,951 సీట్లు మిగిలిపోయినట్లు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. మొత్తంగా కన్వీనర్ కోటాలో 1,39,254 సీట్లకు 1,20,303 భర్తీ అయ్యాయి. ఆగస్టు 3లోగా విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ స్పష్టం చేశారు.

Similar News

News January 10, 2025

ఢిల్లీ పొలిటికల్ దంగల్‌కి నోటిఫికేష‌న్ విడుదల

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ రోజు నుంచి నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభంకానుంది. Jan 17 నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ. అధికార ఆప్‌, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపికను దాదాపుగా ఖ‌రారు చేసి ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. ఒకే విడతలో Feb 5న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కోసం ఆయా పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 8న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

News January 10, 2025

అది నిరూపిస్తే నేను పేరు మార్చుకుంటా: అశ్విన్

image

రిషభ్ పంత్ దూకుడైన ఆటతో పాటు డిఫెన్స్ బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. BGTలో పంత్ పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు స్పందించారు. అతను డిఫెన్స్ చేస్తూ 10సార్లు ఔట్ అయిన క్లిప్ చూపిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పంత్ డిఫెన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదని కొనియాడారు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పారు.

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’ చరణ్ పాత్రకు ఈయనే ఇన్స్పిరేషన్!

image

నేడు రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో IAS అధికారిగా చరణ్ కనిపించారు. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించగా, ఓ IASను స్ఫూర్తిగా తీసుకుని ఆ క్యారెక్టర్‌‌‌ను తీర్చిదిద్దారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ అధికారే తమిళనాడు కేడర్‌కు చెందిన TN శేషన్‌. 90వ దశకంలో భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో రాజకీయ నాయకులను గడగడలాడించారని చెబుతుంటారు. దీంతో ఆయన కెరీర్ కేసులు, వివాదాలతోనే నడిచింది.