News July 31, 2024
తుది విడతలో 17,575 సీట్ల కేటాయింపు
AP: ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఫైనల్ ఫేజ్‌లో 17,575 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయినప్పటికీ మరో 18,951 సీట్లు మిగిలిపోయినట్లు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. మొత్తంగా కన్వీనర్ కోటాలో 1,39,254 సీట్లకు 1,20,303 భర్తీ అయ్యాయి. ఆగస్టు 3లోగా విద్యార్థులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ స్పష్టం చేశారు.
Similar News
News October 8, 2024
డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు
AP: డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభం అవుతాయని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వంటి పలు అంశాలను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు పేర్కొన్నారు.
News October 8, 2024
హరియాణా ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన ప్రకటన
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రజల అభీష్టాన్ని BJP తారుమారు చేసిందని దుయ్యబట్టింది. హరియాణాలోని 3 జిల్లాల్లో EVMల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. BJPది ప్రజాభీష్టాన్ని తారుమారు చేసిన విజయంగా అభివర్ణించారు.
News October 8, 2024
రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్
AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.