News July 31, 2024
ఆగస్టు 5 నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’: మంత్రి సీతక్క
TG: ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు రూ.378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.
Similar News
News December 27, 2024
తూ.గో: న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు
న్యూ ఇయర్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని తూ.గో. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. కొవ్వూరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్పీ తనిఖీలు చేశారు. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు.
News December 27, 2024
TODAY HEADLINES
* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
* ఏపీలో ఈ నెల 31న పింఛన్ల పంపిణీ
* పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
* మస్కట్ బాధితురాలికి అండగా నారా లోకేశ్
* తెలంగాణ విద్యార్థులకు 11 రోజులు సెలవులు
* మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య?
* మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ
* ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
* రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
News December 27, 2024
నా మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ గాంధీ
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్‌కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు.