News July 31, 2024
ఆగస్టు 5 నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’: మంత్రి సీతక్క
TG: ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు రూ.378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.
Similar News
News December 1, 2024
ఈ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు డిసెంబర్ 2న సెలవు ప్రకటించారు. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రకటించారు. విద్యాసంస్థలన్నీ సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
News December 1, 2024
‘పీలింగ్స్’పై స్పందించిన రష్మిక.. అల్లు అర్జున్ కామెంట్ ఇదే!
పుష్ప-2 నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. డాన్స్ విషయంలో తన కెరీర్లో ఇప్పటి వరకూ ఇదే అత్యంత కష్టమైన సాంగ్ అని రష్మిక ట్వీట్ చేశారు. ‘పీలింగ్స్ సాంగ్ ఫుల్ వైబ్, ఫుల్ మాస్. ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయం. అల్లు అర్జున్ సార్ వల్ల ఆ భయాన్ని దాటాను. చాలా కష్టమైన పాట కానీ ఎంజాయ్ చేశాను’ అని పేర్కొన్నారు. అద్భుతంగా డాన్స్ చేశారంటూ ‘యూ రాక్డ్’ అని అల్లు అర్జున్ ఆమెకు బదులిచ్చారు.
News December 1, 2024
అలా అయితే దేశం వృద్ధి చెందదు: రాహుల్
ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కొద్ది మంది బిలియనీర్లకే దక్కినంత కాలం దేశం వృద్ధి చెందదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పేదల ఆర్థిక సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల కనిష్ఠానికి, GDP వృద్ధి రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోవడం ఆందోళనకరమన్నారు. అందరికీ సమాన అవకాశాలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచనలు అవసరమన్నారు.