News July 31, 2024

పీవీ సింధు కోసం ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశా: మను భాకర్

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కోసం గతంలో తానో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నానని తెలిపారు. ‘నా సమకాలికుల్లో పీవీ సింధు, నీరజ్ చోప్రా దిగ్గజాలు. సింధుపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ నాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి సింధుకు మద్దతుగా నిలిచాను’ అని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

వారికి రూ.2,500 స్కాలర్‌షిప్?

image

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్‌లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.

News March 16, 2026

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

image

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

News March 16, 2026

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్‌ ఖాన్‌‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.