News August 1, 2024

BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

image

చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1653.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1896గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

Similar News

News January 13, 2026

ఐఫోన్ యూజర్లకు అలర్ట్

image

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.

News January 13, 2026

ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

image

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

News January 13, 2026

నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ

image

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.