News August 1, 2024
BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1653.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1896గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
Similar News
News November 7, 2025
విటమిన్స్ లోపం-లక్షణాలు

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.


