News August 1, 2024

కేరళ డిజాస్టర్.. 270 దాటిన మరణాలు!

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 270 దాటినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సైన్యం, NDRF సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 166 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. గాయపడిన 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 225 మంది గల్లంతైనట్లు సమాచారం.

Similar News

News March 11, 2026

భర్తతో విడాకులు.. భరణం ఆశించని హన్సిక

image

ఇటీవల సెలబ్రిటీల విడాకులు అనగానే భరణం గురించే చర్చ జరుగుతుంది. కానీ తాజాగా భర్త సోహైల్ నుంచి <<19354762>>డివోర్స్<<>> తీసుకున్న హీరోయిన్ హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదు. మనస్పర్ధల కారణంగా ఇరువురి అంగీకారంతో విడిపోతున్నట్లు కోర్టుకు తెలిపారు. చిన్నచిన్న గొడవల కారణంగానే హన్సిక-సోహైల్ మధ్య దూరం పెరిగి విడిగా జీవించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలోని బాంద్రా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

News March 11, 2026

నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

image

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.

News March 11, 2026

BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

image

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.