News August 1, 2024
రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుంది: మందకృష్ణ

న్యాయం, ధర్మం కోసం చేసిన పోరాటం ఫలించిందని సుప్రీం కోర్టు <<13751609>>తీర్పును<<>> ఉద్దేశించి మందకృష్ణ మాదిగ అన్నారు. మాల సోదరులు అధైర్యపడొద్దని, అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుందని, అన్యాయానికి గురైన వర్గాల వైపే న్యాయస్థానం నిలబడిందని తెలిపారు. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 16, 2026
‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్‌లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది.
News March 16, 2026
నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News March 16, 2026
ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది?

కొందరు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవాలని పదేపదే సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటుంటారు. దీని వల్ల చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.


