News August 1, 2024

రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుంది: మందకృష్ణ

image

న్యాయం, ధర్మం కోసం చేసిన పోరాటం ఫలించిందని సుప్రీం కోర్టు <<13751609>>తీర్పును<<>> ఉద్దేశించి మందకృష్ణ మాదిగ అన్నారు. మాల సోదరులు అధైర్యపడొద్దని, అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుందని, అన్యాయానికి గురైన వర్గాల వైపే న్యాయస్థానం నిలబడిందని తెలిపారు. వర్గీకరణ‌కు సంబంధించిన జీవోలు వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 22, 2026

అతడు ఆడకపోతే కష్టమే.. సూర్య ఫామ్‌పై రోహిత్ ఆందోళన

image

T20 WC దగ్గరపడుతున్న వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అతను సరిగా ఆడకపోతే ఆ ప్రభావం మొత్తం బ్యాటింగ్‌ లైనప్‌పై పడుతుందన్నారు. ఇది SKYకి ఒక్కడికే వర్తించదని.. ఏ ప్లేయర్ ఫామ్‌లో లేకపోయినా దాని ప్రభావం టీమ్‌పై ఉంటుందన్నారు. సూర్యకు ఆటపైనా, ప్లేయర్లపైనా, వారి నుంచి బెస్ట్ రాబట్టుకోవడంపైనా మంచి అవగాహన ఉంటుందంటూ అతడి లీడర్‌షిప్ స్కిల్స్‌ను ప్రశంసించారు.

News January 22, 2026

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

image

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు.

News January 22, 2026

పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

image

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రో‌ల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.