News August 1, 2024

బీసీసీఐకి కావ్యా మారన్ కీలక సూచనలు?

image

నిన్న జరిగిన IPL ఓనర్ల సమావేశంలో SRH ఓనర్ కావ్యా మారన్ BCCIకి పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ ఏడుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరినట్లు సమాచారం. అలాగే ఆ ఏడుగురిలో ఎవరినైనా (విదేశీ, స్వదేశీ, అన్‌క్యాప్‌డ్) అట్టిపెట్టుకునే ఛాన్స్, ఆక్షన్ సమయంలో రిటెన్షన్ గురించి ప్లేయర్లతో చర్చించే అవకాశం కల్పించాలని, ఐదేళ్లకోసారి మెగా వేలం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.

Similar News

News December 26, 2024

పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్

image

తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

News December 26, 2024

పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?

image

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.

News December 26, 2024

మస్కట్‌ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్

image

AP: మస్కట్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.