News August 1, 2024

బీసీసీఐకి కావ్యా మారన్ కీలక సూచనలు?

image

నిన్న జరిగిన IPL ఓనర్ల సమావేశంలో SRH ఓనర్ కావ్యా మారన్ BCCIకి పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ ఏడుగురిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరినట్లు సమాచారం. అలాగే ఆ ఏడుగురిలో ఎవరినైనా (విదేశీ, స్వదేశీ, అన్‌క్యాప్‌డ్) అట్టిపెట్టుకునే ఛాన్స్, ఆక్షన్ సమయంలో రిటెన్షన్ గురించి ప్లేయర్లతో చర్చించే అవకాశం కల్పించాలని, ఐదేళ్లకోసారి మెగా వేలం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.

Similar News

News December 1, 2024

ఉస్మా’నయా’ ఆస్పత్రిపై సీఎం సమీక్ష

image

TG: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి వెళ్లే రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు.

News December 1, 2024

132 ఏళ్ల సీసాలో సందేశం.. ఇప్పుడు దొరికింది!

image

132 ఏళ్ల క్రితం గాజు సీసాలో పెట్టిన సందేశమది. స్కాట్లాండ్‌లోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్‌ పనితీరును ఓ మెకానికల్ ఇంజినీర్ సమీక్షిస్తుండగా గోడల్లో బయటపడింది. 1892, సెప్టెంబరు 4న ఆ లైట్‌హౌస్‌ను నిర్మించిన ముగ్గురు ఇంజినీర్లు తమ పేర్లను, ముగ్గురు సిబ్బంది పేర్లను రాసిన కాగితాన్ని సీసాలో పెట్టి గోడలో భద్రపరిచారు. అది ఇన్నేళ్లకు వెలుగుచూసింది. దాన్ని కనుగొన్న అధికారులు వారూ ఓ సీసాను పెట్టాలనుకుంటున్నారు.

News December 1, 2024

BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.