News August 1, 2024

20K to 25K: నిఫ్టీకి ప్రాణం పోసిన 10 స్టాక్స్

image

గత సెప్టెంబర్లో 20K నుంచి ఇప్పుడు 25K మైలురాయిని (25%) తాకేందుకు నిఫ్టీ50 సూచీ 220 సెషన్లే తీసుకుంది. ఈ 5వేల పాయింట్ల ర్యాలీలో 10 స్టాక్సే 50% మేర కంట్రిబ్యూట్ చేశాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కలిపి 8%, TCS, SBI, ONGC, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, NTPC, M&M, ఇన్ఫోసిస్ కలిపి 38.6% కంట్రిబ్యూట్ చేశాయి. ఈ వ్యవధిలో ఈ కంపెనీల MCap రూ.23.29 లక్షల కోట్లు పెరిగింది. మరో 36 కంపెనీలు 1-3% పెరిగాయి.

Similar News

News March 10, 2026

12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

image

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

News March 10, 2026

చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

image

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.

News March 10, 2026

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులు

image

AP: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల వరకు లేదా కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు వీరి పాలన సాగనుంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లు సహా ఇతర సంస్థలకు RDO, JCలను ప్రత్యేక అధికారులుగా నియమించింది.