News August 1, 2024
ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 23, 2026
SIR ఆందోళనతో 110 మంది మృతి: మమత

SIR ఆందోళన కారణంగా వెస్ట్ బెంగాల్లో ప్రతిరోజూ 3-4 ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆ రాష్ట్ర CM మమత ఆరోపించారు. ‘ఇప్పటికే మరణాలు 110కి చేరాయి. మరో 45 మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. కేంద్రం, EC వీటికి బాధ్యత వహించాలి. ఇప్పటికే 58 లక్షల ఓట్లు తొలగించారు. మరో 1.66 కోట్ల మంది అర్హతపై విచారణ చేస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత దేశ పౌరులమో కాదో నిరూపించుకోవాలా?’ అని సుభాష్ చంద్రబోస్ జయంతిలో ప్రశ్నించారు.
News January 23, 2026
సునీతా విలియమ్స్ పెన్షన్ ఎంతో తెలుసా?

27 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన సునీతా విలియమ్స్‌కు ఏడాదికి దాదాపు ₹36 లక్షల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. FERS ద్వారా అందే ఈ పెన్షన్‌తో పాటు, అమెరికా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి అదనపు నెలవారీ ఆదాయం కూడా లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, TSP ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ వంటి బెనిఫిట్స్ అందుతాయి. నాసా నుంచి ప్రత్యేక మెడికల్ సపోర్ట్ కొనసాగుతుంది.
News January 23, 2026
దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్డు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.


