News August 1, 2024

ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

image

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News December 12, 2024

57 ఏళ్ల తర్వాత HYDలో సంతోష్ ఫుట్‌బాల్ టోర్నీ

image

మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

News December 12, 2024

6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP

image

AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్‌లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.

News December 12, 2024

ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

image

దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.