News August 2, 2024

నరసన్నపేట: పెన్షన్ పంపిణీలో అలసత్వం.. 30 మందికి నోటీసులు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదు పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చినట్లు నరసన్నపేట ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకు పెన్షన్ ప్రారంభించాల్సి ఉండగా 6.30 గంటలు వరకు కూడా నగదు పంపిణీని సిబ్బంది ప్రారంభించలేదన్నారు. దీంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు.

Similar News

News November 4, 2025

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.

News November 4, 2025

శ్రీకాకుళం: ‘పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణ కట్టుదిట్టం చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసం మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్ట్యా పటిష్ఠమైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో వీసీ నిర్వహించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి ముఖ్య రోజుల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున భద్రతలు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 4, 2025

రైల్వే ప్రాజెక్టుల పనులు పురోగతిపై సమీక్ష

image

విశాఖపట్నంలో మంగళవారం జరిగిన వాల్తేర్ రైల్వే డివిజన్ సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో వివిధ రైల్వేస్టేషన్స్‌లో సౌకర్యాలు కల్పన, కొత్త రైలు ప్రతిపాదనలుపై ప్రత్యేక దృష్టి సారించాలని DRMను ఆదేశించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి ఉన్నారు.