News August 2, 2024

మద్యంపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని CM వెల్లడించారు.

Similar News

News January 15, 2025

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025

image

*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్

News January 15, 2025

ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. EAPCET తేదీలు వచ్చేశాయ్

image

TG: ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCETను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. APR 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.

News January 15, 2025

భారత మహిళా జట్టు విధ్వంసం.. 50 ఓవర్లలో 435 రన్స్

image

ఐర్లాండ్‌ మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసింది. ప్రతికా రావల్(154), స్మృతి మంధాన(135) సెంచరీలతో చెలరేగగా, రిచా ఘోష్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా నాలుగో స్థానం. గతంలో కివీస్ ఉమెన్ 491/4, 455/5, 440/3 స్కోర్లు చేసి టాప్‌లో ఉంది.