News August 2, 2024
మద్యంపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని CM వెల్లడించారు.
Similar News
News September 18, 2024
మండుతున్న ఎండలు.. 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత
రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న ఏపీలోని కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి గాలులు పూర్తిగా పొడిగా మారడం, మేఘాలు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏసీ, ఫ్యాన్లు లేకుండా ఉండలేకపోతున్నామని, వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.
News September 18, 2024
పంటల వారీగా నష్టపరిహారం ఇలా..
AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.
News September 18, 2024
వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!
AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.