News August 3, 2024
రాష్ట్రంలో డెంగ్యూ పంజా.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

TG: రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జులైలోనే 800 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2,071 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో లారా వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రకటించింది. దోమల వ్యాప్తి జరగకుండా అన్ని జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు.
Similar News
News March 13, 2026
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.6వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.6వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కృష్ణా(D) గన్నవరంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
News March 13, 2026
అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

ఆన్‌లైన్‌లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.


