News August 3, 2024

రోల్స్‌రాయిస్‌ని అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో?

image

తమిళ హీరో విజయ్‌ 2012లో రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఇష్టంగా కొనుక్కున్న ఆ కారు కోసం అప్పట్లో లీగల్ ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ కారును ఆయన అమ్మకానికి పెట్టడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సుమారు రూ.2.6 కోట్లకు విజయ్ కారును అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పార్టీని నడిపేందుకే విజయ్ కారును అమ్ముతున్నారేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Similar News

News March 17, 2026

TU: సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్‌పై అవగాహన కరపత్రాల విడుదల

image

విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అన్నారు. ఈ నెల 25న PIB, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రిజిస్ట్రార్ యాదగిరి, పలువురు ప్రొఫెసర్లతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.

News March 17, 2026

‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

image

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 17, 2026

వంటింటి చిట్కాలు

image

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.