News August 3, 2024
రోల్స్‌రాయిస్‌ని అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో?

తమిళ హీరో విజయ్ 2012లో రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. ఇష్టంగా కొనుక్కున్న ఆ కారు కోసం అప్పట్లో లీగల్ ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ కారును ఆయన అమ్మకానికి పెట్టడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సుమారు రూ.2.6 కోట్లకు విజయ్ కారును అమ్మనున్నట్లు ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పార్టీని నడిపేందుకే విజయ్ కారును అమ్ముతున్నారేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
APPLY NOW: ICMRలో 28 పోస్టులు

<
News December 17, 2025
టోనర్ ఎంపిక ఇలా..

ప్రస్తుతం స్కిన్‌కేర్‌పై అందరికీ అవగాహన పెరిగింది. దీంట్లో ముఖ్యమైనది టోనర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారు తేమను అందించే టోనర్, సున్నితచర్మం ఉన్నవారు కలబంద, చామంతి గుణాలున్నవి, జిడ్డు చర్మం ఉన్నవారు తాజాదనాన్ని కలిగించేవి ఎంచుకోవాలి. ఆల్కహాల్, పారాబెన్స్, బెంజైల్ పెరాక్సైడ్ వంటివి హాని చేస్తాయి. కాబట్టి టోనర్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. <<-se>>#SkinCare<<>>
News December 17, 2025
మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.


