News August 3, 2024

అందుకే టెస్టులపై ఆసక్తి పోయింది: రస్సెల్

image

టీ20 లీగ్స్‌లో కావాల్సినంత డబ్బు వస్తుండటంతో చాలా మంది ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతున్నారని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ అన్నారు. ఈ ఒక్క కారణంతోనే టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి చూపడం లేదని చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగానే క్రికెటర్లు కూడా తయారవుతున్నారని పేర్కొన్నారు. కాగా వెస్టిండీస్ ప్లేయర్లు పొలార్డ్, పూరన్, పావెల్ వంటి ఆటగాళ్లు ఇంతవరకూ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.

Similar News

News March 5, 2026

30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

image

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.

News March 5, 2026

ఖమేనీ మృతిపై సంతాపం తెలిపిన భారత్

image

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఆయన మరణానికి సంతాపం తెలియజేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్వయంగా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి రాయబారులతో మాట్లాడారు. అక్కడ సంతాప సందేశ బుక్‌పై సంతకం చేశారు. కాగా ఖమేనీ మృతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

News March 5, 2026

అణుబాంబులన్నీ పేలితే ఏం జరుగుతుంది?

image

అమెరికా అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలను అతలాకుతలం చేశాయి. అలాంటిది ప్రపంచ దేశాలు తమ దగ్గరున్న 12వేల అణుబాంబులను ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కేవలం 100 అణుబాంబులు పేలితే వచ్చే పొగ సూర్యరశ్మిని పదేళ్లపాటు అడ్డుకుంటుంది. దీనివల్ల భూమి గడ్డకట్టి ‘న్యూక్లియర్ వింటర్’ ఏర్పడుతుంది. పంటలు పండవు, గాలి కలుషితమై మనుషులు అంతమైపోతారు. అదే 12వేల అణుబాంబులు పేలితే సగం సోలార్ సిస్టమ్ ఉండదు.