News August 3, 2024
అందుకే టెస్టులపై ఆసక్తి పోయింది: రస్సెల్

టీ20 లీగ్స్‌లో కావాల్సినంత డబ్బు వస్తుండటంతో చాలా మంది ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌కే పరిమితమవుతున్నారని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ అన్నారు. ఈ ఒక్క కారణంతోనే టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి చూపడం లేదని చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగానే క్రికెటర్లు కూడా తయారవుతున్నారని పేర్కొన్నారు. కాగా వెస్టిండీస్ ప్లేయర్లు పొలార్డ్, పూరన్, పావెల్ వంటి ఆటగాళ్లు ఇంతవరకూ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.
Similar News
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్‌పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్‌గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.
News December 7, 2025
వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.
News December 7, 2025
6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్‌కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.


