News August 3, 2024

విరాట్‌తో కలిసి ఆడటం సరదాగా ఉండేది: ధోనీ

image

విరాట్ కోహ్లీతో తన స్నేహబంధంపై మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఇద్దరం కలిసి భారత్‌కు చాలా కాలం ఆడాం. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకరు. మేం క్రీజులో ఉన్నప్పుడు.. కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉండేది. మేం ఎక్కువగా డబుల్స్, త్రిపుల్స్ తీసేవాళ్లం. బయట మీట్ అయ్యేది తక్కువే కానీ కలిసిన ప్రతీసారి చాలా మాట్లాడుకుంటాం’ అని వివరించారు.

Similar News

News March 8, 2026

డిగ్రీ, పీజీలో కొత్త విధానం.. కోర్సు మధ్యలో ఆపేయవచ్చు!

image

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ తరహాలో డిగ్రీ, పీజీలోనూ క్రెడిట్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విధానంలో పాస్ కావాలంటే 3ఏళ్ల డిగ్రీలో కనీసం 120, 4ఏళ్ల ఆనర్స్ డిగ్రీలో 160, PGలో 80 క్రెడిట్లు సాధించాలి. డిగ్రీ, PG మధ్యలో ఆపేసి తర్వాత పూర్తి చేయవచ్చు. డిగ్రీ ఫస్టియర్‌లో మానేస్తే సర్టిఫికెట్ కోర్సుగా పరిగణిస్తారు. 2nd yrలో మానేస్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.

News March 8, 2026

T20 WC: ‘ఫైనల్’ పంచ్ ఎవరిది?.. జట్టులో మార్పులు ఉంటాయా?

image

T20 WC ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ రా.7 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి. సొంత గడ్డపై WC గెలిచి చరిత్ర సృష్టించాలని ఇండియా, ఈసారైనా కప్ గెలవాలని కివీస్ పట్టుదలతో ఉన్నాయి. అభిషేక్, వరుణ్ స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్‌ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా మార్పుల్లేకుండానే IND బరిలోకి దిగే అవకాశముంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News March 8, 2026

మరో స్టార్ హీరోతో నయనతార నయా ప్రాజెక్ట్!

image

ఏజ్ పెరుగుతున్నా నయనతార క్రేజ్ తగ్గట్లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కి తగ్గట్లు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. షారుఖ్‌ఖాన్‌తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.