News August 3, 2024

విరాట్‌తో కలిసి ఆడటం సరదాగా ఉండేది: ధోనీ

image

విరాట్ కోహ్లీతో తన స్నేహబంధంపై మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఇద్దరం కలిసి భారత్‌కు చాలా కాలం ఆడాం. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకరు. మేం క్రీజులో ఉన్నప్పుడు.. కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉండేది. మేం ఎక్కువగా డబుల్స్, త్రిపుల్స్ తీసేవాళ్లం. బయట మీట్ అయ్యేది తక్కువే కానీ కలిసిన ప్రతీసారి చాలా మాట్లాడుకుంటాం’ అని వివరించారు.

Similar News

News September 18, 2024

ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు

image

తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.

News September 18, 2024

BREAKING: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు

image

TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.

News September 18, 2024

ముగిసిన క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.