News August 3, 2024
గంభీర్ ప్రయోగం బెడిసికొట్టిందా?

శ్రీలంకతో తొలి వన్డేలో గెలవాల్సిన టీమ్ ఇండియా టైతో సరిపెట్టుకుంది. మ్యాచ్ టై కావడానికి హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రయోగమే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే అయ్యర్‌కు బదులుగా సుందర్‌ను పంపారు. సుందర్ 5 పరుగులకే వెనుదిరిగి ఒత్తిడి పెంచారు. మరోవైపు స్పిన్నర్లపై దూకుడుగా ఆడే దూబేను కూడా ఎనిమిదో స్థానంలో పంపడం భారత్‌కు నష్టం చేకూర్చిందని విమర్శిస్తున్నారు.
Similar News
News November 12, 2025
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించా: ధర్మారెడ్డి

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీబీఐ సిట్ రెండో రోజు 8 గంటలపాటు విచారించింది. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరించినట్లు ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. ‘అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే నన్నూ విచారించారు’ అని మీడియాకు తెలిపారు.
News November 12, 2025
TG, AP న్యూస్ రౌండప్

✦ DEC 20 నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి పొంగులేటి
✦ రాష్ట్రంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. నిబంధనలు ఉల్లంఘించే వెహికల్స్‌కు భారీ ఫైన్: మంత్రి పొన్నం
✦ DEC 3 నుంచి అందుబాటులోకి TG SET హాల్ టికెట్లు
✦ విజయవాడలో 249kgs గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్
✦ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
News November 12, 2025
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.


