News August 3, 2024
గంభీర్ ప్రయోగం బెడిసికొట్టిందా?

శ్రీలంకతో తొలి వన్డేలో గెలవాల్సిన టీమ్ ఇండియా టైతో సరిపెట్టుకుంది. మ్యాచ్ టై కావడానికి హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రయోగమే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాలుగో స్థానంలో రెగ్యులర్‌గా ఆడే అయ్యర్‌కు బదులుగా సుందర్‌ను పంపారు. సుందర్ 5 పరుగులకే వెనుదిరిగి ఒత్తిడి పెంచారు. మరోవైపు స్పిన్నర్లపై దూకుడుగా ఆడే దూబేను కూడా ఎనిమిదో స్థానంలో పంపడం భారత్‌కు నష్టం చేకూర్చిందని విమర్శిస్తున్నారు.
Similar News
News December 15, 2025
హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్‌కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్‌నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.


